రాష్ట్ర బడ్జెట్‌ పై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు

అమరావతి : రాష్ట్ర బడ్జెట్‌ పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు మంగళవారం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్లమెంట్‌ రీసెర్చ్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకూ గల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సు అనంతరం సీఎం అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.

➡️