కరీంనగర్ : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా ….. కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారింది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈక్రమంలో మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
