ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు జిల్లా నాలుగో అదనపు కోర్టులో ఊరట దక్కింది. రూ.10వేల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
