ప్రేమికుడి ఇంటి ముందు గిరిజన మహిళ బైఠాయింపు

Apr 15,2024 14:56 #eluru, #Protest, #tribal woman

బుట్టాయిగూడెం (ఏలూరు) : ‘ న్యాయం చేయండి ‘ అంటూ … ప్రేమికుడి ఇంటి ముందు బైఠాయించి గిరిజన మహిళ నిరసన చేపట్టిన ఘటన సోమవారం జరిగింది.

బాధితురాలి కథనం ప్రకారం …. బుట్టయిగూడెం మండలం, దోరమామిడి, పంచాయితీ, రంగాపురం గ్రామానికి చెందిన కోడే రమ్య భారతి , కొయ్యలగూడెం మండలం బోడిగూడెంకు చెందిన మెంటీ సాయి ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో మేంటి సాయి, మనం పెళ్లి చేసుకుందాం అని రమ్య భారతితో చెప్పడంతో, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఐతే అది నిజం అని నమ్మిన రమ్య భారతి కుటుంబ సభ్యులు త్వరలో పెళ్లి జరుగుతుంది అనుకున్నారు. కానీ బాధితురాలు అప్పటికే 6 నెలల నిండు గర్భిణీ. ట్విన్స్‌ అని వైద్యులు చెప్పగా విషయం తెలుసుకున్న సాయి కుటుంబ సభ్యులు , పరీక్షలకు అని మాయమాటలు చెప్పి దేవరపల్లి లో గుర్తు తెలియని క్లినిక్‌ కు తీసుకువెళ్ళి, మత్తు మందు ఇచ్చి అబార్షన్‌ చేయించారు. ఐతే జాబ్‌ కోసం అని హైదరాబాద్‌ కు సాయిని కుటుంబ సభ్యులు పంపారు. రోజూ రమ్యతో మాట్లాడుతూనే సాయి హైదరాబాద్‌లో మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న బాధితురాలు, కుటుంబ సభ్యులు బోడిగూడెంలో సాయి ఇంటి వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఇది తెలుసుకున్న కొయ్యలగూడెం పోలీసులు బాధితురాలు బైఠాయించిన స్థలం వద్దకు చేరుకొని ” ఇక్కడ నిరసన చేయడానికి వీలు లేదు , మీరు బుట్టాయగూడెం లో కేసు పెట్టారు అక్కడ చూసుకోవాలి ” అని బెదిరింపులకు దిగారు అని రమ్య భారతి అన్నారు. ఐతే తాము ఎలాంటి కేసు పెట్టలేదు అని, తమకు న్యాయం కావాలి అని , ఎవరు ఎంత బెదిరించిన న్యాయం జరిగేవరకు ఇక్కడే వుంటాం అని రమ్య భారతి ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. సాయి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

➡️