బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

Mar 14,2025 09:08 #Balakrishna's house, #car accident

తెలంగాణ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో సినీనటుడు బాలకృష్ణ ఇంటి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్‌-1 లో బాలయ్య ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌ పైకి శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు వేగంతో దూసుకెళ్లి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, కారు డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆ కారు.. మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 మీదుగా చెక్‌పోస్ట్‌ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

➡️