హుక్కా పార్లర్లపై నిషేధం – తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా శాసనసభ దీనికి ఆమోదం తెలిపింది.ఈ మేరకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ … సిగరెట్‌ కంటే హుక్కా పొగ మరింత హానికరం అని అన్నారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుందని, దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం ఉంటుందన్నారు. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సిఎం భావించారని వివరించారు.

➡️