Betting apps : సోషల్‌మీడియా, టీవీ నటులపై కేసులు నమోదు

హైదరాబాద్‌: బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తోన్న పలువురు సోషల్‌మీడియా, టీవీ నటులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రీత, సుధీర్‌, అజయ్, సన్నీ యాదవ్‌, సందీప్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి.వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన్నట్లు సమాచారం.

➡️