- నేడు దేవదాయశాఖ మంత్రి పట్టు వస్త్రాలు సమర్పణ
ప్రజాశక్తి – శ్రీశైలం : నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం మహాగౌరి అలంకారంలో భ్రమరాంబదేవిని అలంకరించారు. నంది వాహనంపై భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఊరేగించారు. కోలాటలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం సిద్ధిదాయినిగా అమ్మవారిని అలంకరించనున్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు దంపతులు తదితరులు పాల్గొన్నారు.