హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ చేశారు.. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరుగనుంది. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందుభాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు.
సచివాలయం అన్ని విధాలా సముచితమైన ప్రదేశమని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ గౌరవప్రదంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 9న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే రోజును నిర్ణయించినట్లు వివరించారు. సచివాలయం ఎదుట దేశ ప్రగతికి బాటలు వేసిన రాజీవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సముచితమని.. అయితే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే విగ్రహాన్ని తొలగిస్తానని కేటీఆర్ మాటలకు రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.. ఎవరైనా విగ్రహంపై చేయి వేస్తే చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఓడిపోయినా బీఆర్‌ఎస్ నేతల తీరు మారలేదని..మీరు మళ్లీ అధికారంలోకి రాలేరని సీఎం అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ఆందోళనకే పరిమితమయ్యారని.. పదేళ్లుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వారు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
