విశాఖ వస్తున్న విమానాలకు బాంబు బెదిరింపు

Oct 29,2024 22:16 #Bomb Threat, #coming Visakha, #flights

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : చెన్నై నుంచి విశాఖపట్నం వస్తున్న 6ఇ 917, బెంగళూరు నుంచి విశాఖపట్నం వస్తున్న 6ఇ969 విమానాలలో బాంబులు ఉన్నాయని మంగళవారం సాయంత్రం 5:36 గంటలకు ఆడమ్‌ లాంజా 202 ఐడి నుంచి వచ్చిన బాంబు బెదిరింపు ట్వీట్‌పై అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత ఎయిర్‌ లైన్స్‌ స్టేషన్‌ మేనేజర్‌ తన రీజనల్‌ సెక్యూరిటీ హెడ్‌కు బాంబు బెదిరింపుల సమాచారం అందించారు. అయితే, ఈ రెండు విమానాలు విశాఖలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యాయి. వాటిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి నిబంధనల ప్రకారం భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

➡️