తిరుపతి హోటళ్ళకు మరోసారి బాంబు బెదిరింపులు

తిరుపతి : తిరుపతిలో హోటళ్ళకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి తిరుపతి హోటల్ లో బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలు హోటల్లో తనిఖీలు చేశారు. అయితే అనుమానాస్పదంగా ఏమి దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో హోటల్ లోని టూరిస్టులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తుండటంతో తిరుపతిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాంబు బెదిరింపు వచ్చిన ఈమెయిల్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

➡️