రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

May 16,2024 15:05 #hyderabad, #road accidents

హైదరాబాద్‌ : బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న కారుడు డివైడర్‌ పైనుంచి వెళ్లి ట్రావెల్‌ బస్సును ఢ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌, మహిళలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఫ్లై ఓవర్‌ పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

➡️