- నేడు నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా!
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్‌గా బొలినేని రాజగోపాల్ నాయుడు పేరు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన టివి-5 ఛానెల్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. సోమవారం నామినేటెడ్ పదవుల రెండు జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో టిటిడి బోర్డు ఛైర్మన్, సభ్యుల పేర్లు కూడా విడుదల కానున్నాయి. మొత్తం 15 మంది సభ్యులతో బోర్డు ఉంటుందని తెలిసింది. సభ్యులుగా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉండే అవకాశం ఉంది. జనసేన, బిజెపి నుంచి చేరొక సిట్టింగ్ ఎమ్మెల్యేను నియమించవచ్చని తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీని దసరాలోపు దశలవారీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ భావిస్తున్నారు.