విద్యుద్ఘాతంతో అన్నదమ్ములు మృతి

ప్రజాశక్తి-గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు అన్నదమ్ముళుమతిచెందిన ఘటన ప్రకాశం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన శీలం గోపీకృష్ణ శుభకార్యాలకు సామాన్లు సప్లరు చేస్తుంటారు. ఆయన కుమారులు శీలం లోహిత్‌ కృష్ణ (18) ఐటిఐ (ఎలక్ట్రికల్‌) ఫస్ట్‌ఇయర్‌, శీలం సాయి కృష్ణ (16) పదోతరగతి పూర్తి చేశారు. ఖాళీ సమయంలో తండ్రికి తోడుగా సప్లయర్స్‌ పనులలో సాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో లోహిత్‌ కృష్ణ, సాయి కృష్ణ పట్టణంలోని హెచ్‌పి పెట్రోల్‌ బంకు సమీపంలోని ఓ శుభకార్యానికి సామాన్లు సప్లరు చేసి తిరిగి వాటిని తీసుకొని బయలుదేరారు. ఆ పక్కనే ఉన్న విద్యుత్‌ నీటి మోటారు వైర్లు సామాన్లు ఉన్న ఆటోకు తగిలి విద్యుత్‌ సరఫరా అయ్యింది. దీంతో ఆటోలో ఉన్న అన్నదమ్ములిద్దరూ షాక్‌కు గురయ్యారు. వీరిద్దరినీ కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️