బిటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Mar 31,2024 21:45 #btech student, #Dharmavaram, #Suicide

ప్రజాశక్తి- ధర్మవరం టౌన్‌ (శ్రీ సత్యసాయి జిల్లా):శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బిటెక్‌ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన టూ టౌన్‌ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు… కేతిరెడ్డి కాలనీకి చెందిన చింతా చిదంబరం, శారద దంపతుల కుమార్తె చింతా రాజేశ్వరి (21) పుట్టపర్తిలోని సంస్కృత కళాశాలలో బిటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండేది. పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు కిటికిలోనుంచి చూడగా రాజేశ్వరి ఉరివేసుకుని విగతజీవిగా కన్పించింది. దీనిపై టూ టౌన్‌ పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ఆత్మహత్యకు వివరాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️