కట్లేరు వాగుపై బ్రిడ్జిని నిర్మించండి

  • మంత్రులకు ఎమ్మ్లెల్సీ లక్ష్మణరావు వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్‌టిఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామం వద్ద కట్లేరు వాగుపై బ్రిడ్జిని పునర్‌నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కె.ఎస్‌ లక్ష్మణరావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్‌ రెడ్డి, రవాణాశాఖ మంత్రి ఎం.రాం ప్రసాదరెడ్డికి గురువారం ఆయన వినతిపత్రాన్ని అందచేశారు. ఆరేళ్ల క్రితం వరదల్లో బ్రిడ్జి కూలిపోయిందని, తాత్కాలికంగా చప్టాను ఏర్పాటు చేశారని లక్ష్మణరావు తెలిపారు. దాదాపు 20 వేల మంది ప్రతి రోజు ఈ బ్రిడ్జి ద్వారా ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. గత సిఎం తిరువూరు బహిరంగసభలో నిర్మిస్తామని ప్రకటించినా ఇంతవరకు అనుమతి ఇవ్వలేదన్నారు. తిరువూరు, గంపలగూడెం ప్రజల సౌకర్యం కోసం కట్లేరు వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.

➡️