ప్రజాశక్తి-విజయనగరం కోట : నేడు విజయనగరంలో సిఎం జగన్ ర్యాలీ సందర్భంగా …. విజయనగరం ఎపిఎస్‌ఆర్‌టిసి డిపో నుంచి బస్సులన్నిటినీ విశాఖపట్నం, గాజువాక, మద్దిలపాలెం, పొంగవరపుకోటకు సిఎం సభకు తరలించారు. దీంతో బస్సులు లేక ప్రయాణీకులు తీవ్ర అవస్థలుపడ్డారు. మండుటెండలో సభల కోసం బస్సులను పంపేసి ప్రయాణీకులను అవస్థలుపెడుతున్నారని అన్నారు. ఆటోలు, ఇతర వాహనాలకు డిమాండు పెరిగింది.
