నేడు ‘పోలవరం’పై సదస్సు.. హాజరుకానున్న బి.వి.రాఘవులు

ప్రజాశక్తి – విజయవాడ : సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ‘పోలవరం’పై సదస్సు జరుగుతుంది. ‘పోలవరం ప్రాజెక్టు – రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన – శ్వేతపత్రం’పై వక్తలు మాట్లాడతారు. విజయవాడ గవర్నరుపేట ఎంబి విజ్ఞాన కేంద్రం సమీపంలోని బాలోత్సవ భవనం రెండో అంతస్తులో జరిగే ఈ సదస్సులో సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎంఎల్సి ఐ.వెంకటేశ్వరరావు, ‘ఆదివాసుల జల సమాధి పోలవరం’ రచయిత ఆర్.ఉమామహేశ్వరి, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంత మండలాల నాయకులు పాల్గొంటారు.

➡️