ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీవెన్స్ కార్యక్రమం రద్దయింది. టిడిపి కార్యాలయంలో ప్రతి శనివారం ప్రజావేదిక పేరుతో ప్రజల నుంచి ఆయన వినతులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సామూహిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే నిర్వహించనున్న నేపథ్యంలో కార్యక్రమం రద్దయిందని టిడిపి కార్యాలయం కార్యదర్శి పి అశోక్‌బాబు తెలిపారు. ఈ శనివారం ఎటువంటి గ్రీవెన్స్ ఉండదని వెల్లడించారు.
