గంజాయి విక్రేత అరెస్టు

Sep 28,2024 21:16 #4 arest, #ganjay, #palanadu, #police, #press meet

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 4.5 కిలోల గంజాయితోపాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిఎస్‌పి కె నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన డ్యాన్సర్‌ ఉప్పుతోళ్ల తిరుపతయ్య గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిఐ హైమారావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. తహశీల్దార్‌ సమక్షంలో పూర్తి ఆధారాలతో తిరుపతయ్యను అరెస్టు చేశారు. విశాఖపట్నం నుండి గంజాయిని తీసుకొచ్చి నరసరావుపేటలో అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై ఇప్పటికే గంజాయి కేసులు ఉన్నాయని తెలిపారు. నరసరావుపేట బిసి కాలనీలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

➡️