24 కిలోల గంజాయి స్వాధీనం

Feb 1,2024 09:54 #Drugs, #Manyam District, #Smuggling
cannabis smuggling in manyam

ప్రజాశక్తి – పాచిపెంట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఒడిశాలోని జైపూర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ధనుంజయరావు తెలిపారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్సై నారాయణరావు, సిబ్బంది కలిసి పి.కోనవలస చెక్‌పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఘాట్‌ రోడ్డు మీదుగా బ్యాగులతో కాలినడకన వస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన జితేంద్ర కుమార్‌. రహేరాజ్‌ పుట్‌ బోలా నది అనే ముగ్గురు వ్యక్తులు చెక్‌ పోస్ట్‌ మీదుగా వస్తున్న వారిని తనిఖీ చేయగా 24 కేజీలు గంజాయి లభ్యమైంది. ఈ మేరకు గంజాయి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సిఐ తెలిపారు.

➡️