రాజధాని అమరావతే… : అంబటి రాంబాబు

Feb 12,2024 16:11 #AP Capital, #YCP Minister
Capital of Amaravate Ambati Rambabu

ప్రజాశక్తి-పల్నాడు  : ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పొత్తులపై ఆయన తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. రాజధానిపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతేనని,  కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి అనైతికమైన పొత్తులని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యర్థులు గందరగోళ పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది బీజేపీతోనా, టిడిపితోనా? అని నిలదీశారు..

➡️