ప్రజాశక్తి – తిరుమల : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు మాధురిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తిరుమల కొండపై దువ్వాడ, మాధురి చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటోషూట్ చేసినట్టు మాధురిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్ అధికారులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 292, 296 కింద వారిపై కేసు నమోదయ్యింది.
