హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు

Oct 14,2024 08:46 #DJ Sound, #hyderabad, #mayor

హైదరాబాద్ : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బతుకమ్మ వేడుకల్లో పరిధి దాటిన డీజే వినియోగించడంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శబ్ధ కాలుష్యం చేస్తూ డీజే పెట్టినందుకు మేయర్‌పైకేసు నమోదు చేశారు. ఆమెతో పాటు బతుకమ్మ వేడుకల నిర్వాహకులు, డిజే నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్ బీనగర్ లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అయితే రాత్రి 11.45 గంటల తర్వాత కూడా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని డీజే సౌండ్స్ అభ్యంతరం తెలిపారు. దీనికి మేయర్, నిర్వాహకులు ఒప్పుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో వారిపై కేసు నమోదు చేశారు. కాగా, డీజే వాడకం వల్ల తీవ్ర శబ్ధ కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్, బాణసంచా వినియోగంపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు.

➡️