బ్రాహ్మణపల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద నగదు సీజ్‌

Apr 2,2024 17:08 #Cash seized, #nijamsagar

నిజాంసాగర్‌ :నిజంసాగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు చేయగా కడప జిల్లా అయినటువంటి భూమిరెడ్డి తన కారులో రూ.2,00,000 లక్షల రూపాయలు తీసుకెళ్తూ దొరికాడని ఎస్సై సుధాకర్‌ తెలిపారు. అట్టి నగదు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపియకపోవడం వలన నగదును సీజ్‌ చేశామని ఆయన అన్నారు. సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును ఎవరు కూడా తీసుకెళ్లద్దని ఆయన సూచించారు.

➡️