27న ప్రభుత్వ ఉద్యోగులకు క్యాజువల్‌ లీవ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఈ నెల 27న శాసనమండలి గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగను న్నాయి. ఈ నేపథ్యంలో తమ ఓటుహక్కు ను వినియోగించుకునేందుకు వీలుగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను మం జూరు చేసింది. ఈ మేరకు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసరు ఎంకె మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

➡️