హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరపాలన్న పిటిషన్లపై విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన తెలంగాణ హైకోర్టు… ఈ ఐదు పిటిషన్లను కలిపి ఎల్లుండి విచారణ చేపడతామని తెలిపింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ వేశామని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే జ్యూడీషియల్ విచారణ వేసినందువల్ల సీబీఐ విచారణ అవసరం లేదన్నారు.
