- మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేన్సర్‌పై పోరాటంలో ప్రభుత్వంతోపాటు వైద్యులు, పౌర సమాజం, ప్రజా ప్రతినిధులు, సెలిబ్రిటీలు కలిసిరావాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. నివారణ, ముందస్తు పరీక్షలు, తొలిదశలో గుర్తించడం, సరైన చికిత్స అందించడం ద్వారానే కేన్సర్ మహమ్మారిని ఎదుర్కోగలమని తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లకు ఉచిత ముందస్తు పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.