ప్రజాశక్తి – ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖ కేంద్ర కారాగారంలో తవ్వే కొద్దీ సెల్ ఫోన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పెన్నా బ్యారక్, నర్మదా బ్యారక్ పరిసర ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు దొరికిన విషయం తెలిసిందే. ఆ ఘటనలను మరువకముందే బుధవారం గంగా బ్లాక్ వద్ద మరో కీ ప్యాడ్ సెల్‌పోన్ లభ్యమైంది. రోజువారీ తనిఖీలు, ప్రత్యేక తనిఖీల్లో భాగంగా బుధవారమూ జైలు అధికారులు చర్యలు చేపట్టారు. వారికి సెల్‌ఫోన్ లభ్యం కావడంతో ఆ విషయమై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సాగుతోంది.
