సెంట్రల్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య

Mar 15,2025 21:19 #'suicides', #Central University

ప్రజాశక్తి – బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు, యూనివర్సిటీ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యోజిత సహో (26) స్థానిక సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ సమీపంలో ఓ గదికి అద్దెకు తీసుకున్నారు. తాను అద్దెకు ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. విషయాన్ని మృతురాలి బంధువులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

➡️