ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : స్టీల్ ప్లాంట్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానం మార్చుకుని ప్రైవేటకరణ నిలుపుదల చేయాలనీ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. గురువారం విశాఖ సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ నాయకులు ఆర్‌కెఎస్ కుమార్, ఆర్.స్వామి కలిపి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రలోని బిజెపి ప్రభుత్వం హైద్రాబాద్, చెన్నె మార్కెట్స్, యార్డులు, ఆఫీసులు 476 కోట్లుకు అమ్మడానికి పెట్టారన్నారు. రాయబెరెలీలోని రైల్ స్టీల్‌ప్లాంట్‌ను రూ.1910కోట్లుకు అమ్మారని తెలిపారు. విశాఖలోని స్టీల్‌ప్లాంట్ క్వార్టార్స్ రూ? 250 కోట్లుకు అమ్మడానికి పెట్టారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా అమ్మాలనే నిర్ణయంలో భాగంగానే ఆస్తుల అమ్మకం జరుగుతుందన్నారు. ఈ అమ్మకాలను ఆపాలని నూరుశాతం విశాఖ స్టీల్ అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ప్రధాన మంత్రికి ఎందుకు మెమోరాండం ఇవ్వలేదని ప్రశ్నించారు. సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విలీనం చేయవద్దని ఎవరైన అడ్డుపడ్డారా? ప్రశ్నించారు. జిందాల్ స్టీల్‌తో బ్లాస్ట్ ఫర్నెష్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్లాస్ట్ ఫర్నెష్-1లో ఉత్పత్తి ఎందుకు ఆపారు? గత 3సంవత్సరాల నుండి ముడిసరుకు లేదనో, నిర్వాహణ వ్యయంకు డబ్బులు లేవని, గంగవరం పోర్టు నుండి ముడిసరుకు రాలేదని ఎదో వంకతో ఉత్పత్తి 60 శాతం నుంచి 70శాతం మాత్రమే నడుపుతున్నారన్నారు. 2023-2024 సంవత్సరంలో సుమారు 4వేల కోట్లు నష్టాలు రావడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం వద్ద లెటర్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్‌ఓసి) పెండింగ్‌లో ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే 3వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కావాలనే ఈ సంవత్సరం కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లో నెట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. సెయిల్‌లో విలీనం చేయడానికి వేగంగా చర్యలు చేపట్టాలని ఈ లోపు విశాఖ స్టీల్ పూర్తి సామార్ధ్యంతో నడపాలని డిమాండ్ చేశారు. జిందాల్ సరఫరా చేస్తున్న నాసిరకం కోకింగ్ కోల్‌పై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
