రాజధానిగా అమరావతి : చంద్రబాబు

Jun 11,2024 12:55 #chandrababau, #TDP

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. మన రాజధాని అమరావతి అని అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివద్ధి చేస్తానని… కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబునిచ్చారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు.

➡️