రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళులు

హైదరాబాద్‌: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కాసేపు మౌనం పాటించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామోజీ రావు భార్య రమాదేవి, కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్‌, ఆయన భార్య శైలజా కిరణ్‌, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

➡️