భుజాలు తడుముకుంటున్న చంద్రబాబు

  •  వైసిపి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి చేయించిన ఘటనలో బొండా ఉమాతో పాటు తన పేరు బయటకు వస్తుందనే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని, ఈ ఘటనలో అసలు దొంగ ఆయనే అనిపిస్తోందని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఇప్పటి వరకూ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకున్నా అధికారులు వైసిపి ప్రమేయంతో పనిచేస్తున్నారనడం సరైంది కాదన్నారు.

➡️