- వైసిపి నాయకులు వెంకటరెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతి అప్పుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసిపి సహాయ కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి కోసం ప్రపంచబ్యాంకు, ఎడిబి, హడ్కో నుండి తీసుకున్న అప్పుల్లో కేంద్రసాయం రూ.1,500 కోట్లు మాత్రమేనని వివరించారు. అమరావతి కోసం గతంలో చంద్రబాబునాయుడు రూ.5,335 కోట్లు అప్పు చేశారని, దానికి వడ్డీ కింద రూ.1,573 కోట్లు కడుతున్నారని వివరించారు. ఇంకా రూ.37 వేల కోట్ల రుణం తీసుకుంటున్నారని వివరించారు. వైసిపసి ఎంపి గురుమూర్తి అడిగిన ప్రశ్నలో కేంద్ర గ్రాంటు రూ.1500 కోట్లు మాత్రమేనని, మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని స్పష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి దాన్ని తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు.