ఆ తపనే తారక రాముడిని మహానాయకునిగా చేసింది : చంద్రబాబు

అమరావతి : క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని … టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి ఎన్‌టిఆర్‌ అని కొనియాడారు. అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిస్తూ ట్వీట్‌ చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారన్నారు. సంక్షేమంతో పాటే అభివఅద్ధి, పాలనా సంస్కరణలకూ బాటలు వేశారని అన్నారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్‌ చాటి చెప్పారని తెలిపారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసి అన్ని వర్గాలకు ఆత్మబంధువు అయ్యారని అన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం అని చంద్రబాబు పేర్కొన్నారు.

నాకు నిత్య స్ఫూర్తి ఎన్టీఆర్‌ : నారా లోకేశ్‌
తాత ఎన్టీఆర్‌ తనకు నిత్యస్ఫూర్తి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తెలుగుజాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివఅద్ధికి విశేష కఅషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని లోకేశ్‌ పేర్కొన్నారు.

➡️