రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులతో చంద్రబాబు భేటీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులతో సిఎం చంద్రబాబు దంపతులు శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సందర్భంలో గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌తో చంద్రబాబు సుమారు 30 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య అదానీ అంశంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సోషల్‌ మీడియాలో పెట్రేగిపోయిన యాక్టివిస్టుల అరెస్ట్‌ల గురించి చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, వైసిపి గైర్హాజరు వంటి విషయాలు వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసి

➡️