దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : జూపూడి ప్రభాకర్‌రావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళితులకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్‌ చేశారు. టిప్పర్‌ డ్రైవరు వీరాంజనేయులుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శింగనమల అసెంబ్లీ టికెట్‌ ఇస్తే ఓర్వలేక చంద్రబాబు అవమానించేలా మాట్లాడారని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారని అవమానించారని, ఇప్పుడు వీరాంజనేయులును అలాగే వృత్తిని ఆధారం చేసుకుని అవమానించారని విమర్శించారు. ప్రజల్లో జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు.

➡️