ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు : చంద్రబాబు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశిం చారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయన సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండటంతో పాటు పర్యవేక్షణ ఉంచాలన్నారు. వాగులు, కాలువలు వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రెయిన్‌ఫాల్‌ వివరాలను కూడా రియల్‌ టైమ్‌లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాల సూచించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అవసరమైన ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌టిఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ సిద్దంగా ఉంచినట్లు తెలిపారు.

➡️