ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తన సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నారావారిపల్లికి బుధవారం వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సిఎంకు టిటిడి ఇఒ శ్యామలరావు, కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్‌పి సుబ్బరాయుడు, టిటిడి సివిఎస్‌ఒ శ్రీధర్, అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఆరణి శ్రీనివాసులు, భానుప్రకాష్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట పాటు మంత్రి నారా లోకేష్ ఉన్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లికి వారు చేరుకున్నారు.