సైబర్‌ టవర్స్‌ వద్ద చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ : టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే సీబీఎన్‌’ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు అభిమానులు 74 కిలోల కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

➡️