పెన్షన్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు- మాజీ మంత్రి పేర్ని నాని

Apr 3,2024 23:05 #perni nani, #press meet

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పెన్షన్లు వృద్ధులకు అందకుండా చేసి ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతులకు జన్మభూమి కమిటీల ద్వారా డబ్బులు పంచినా తాము అడ్డుకోలేదన్నారు. అలాగే పసుపు-కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఇసికి ఫిర్యాదు చేయలేదన్నారు. ఇప్పుడు మాత్రం పెన్షన్లు ఆపాలని టిడిపి ఫిర్యాదులు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పిన టిడిపి.. 1.60 లక్షల సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్‌ పంపిణీ చేయాలని ఎలా అనగలుగుతుందని ప్రశ్నించారు.

➡️