ఈ-ఆఫీస్‌ మూసివేతపై గవర్నర్‌కు చంద్రబాబు లేఖ..

May 16,2024 19:14 #ap governer, #chandrababau, #leater, #TDP

ప్రజాశక్తి-అమరావతి: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మే 17 నుంచి 25వరకు అప్గ్రేడ్‌ పేరుతో ఈ-ఆఫీస్‌ మూసివేత నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్కు ఈ లేఖను రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ అప్గ్రేడ్‌ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ-ఆఫీస్‌ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు.. కొత్త ప్రభుత్వం వస్తోన్న వేళ దాన్ని అప్గ్రేడ్‌ చేయాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ-ఆఫీస్‌ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

➡️