చంద్రబాబు ప్రమాణస్వీకార సమయం మార్పు

Jun 9,2024 10:41 #chandrababau, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఈ నెల 12వ తేదీ ఉదయం 9.27 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని ఎపి సిఎంఒ ట్వీట్‌ చేసింది. అంతకుముందు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించగా, తాజాగా సమయంలో మార్పు చేసింది. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటిపార్కు వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని తెలిపింది.

➡️