చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి

May 14,2024 17:21

ప్రజాశక్తి-తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. పులివర్తి నాని ఇవాళ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దాడిలో ఆయన కారు ధ్వంసం అయింది. కాగా, దాడిని నిరసిస్తూ నాని, ఆయన అనుచరులు పద్మావతి వర్సిటీ రోడ్డుపై బైఠాయించారు. దాదాపు 150 మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారని.. వాళ్ల వద్ద కత్తులు, గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయన్నారు. ఘటన జరిగి గంట అవుతున్నా పోలీసులు ఇప్పటివరకు రాలేదని అనుచరులు ఆరోపించారు.

➡️