విద్యుత్‌ విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చండి: సుప్రీంకోర్టు

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోళ్లు, పవర్‌ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టంది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టీస్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తి కాకముందే.. నింబంధనలకు విరుద్ధంగా కమిషన్‌ చైర్మన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టడం సరికాదని పేర్కొంది. వెంటనే కమిషన్‌ జడ్జిని మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్‌కు కొత్త చైర్మన్‌ పేరును వెల్లడిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

➡️