ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలోని ఉర్ధూ పాఠశాలల పని వేళల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 3 నుంచి 30వ తేదీ వరకూ ఉర్ధూ పాఠశాలల పని వేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు మార్పు చేసినట్లు తెలిపారు. ఉర్ధూ మీడియం ప్రాధమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, సమాంతర విభాగం, డైట్ కళాశాలల పని వేళల్లో మార్పు వర్తిస్తుందని తెలిపారు.
