ప్రజాశక్తి -అనంతపురం క్రైం : గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు జాగిలంతో ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్‌ను పసిగట్టడంలో శిక్షణ పొందిన షైనీ జాగిలం ద్వారా అనంతపురం జిల్లా కేంద్రం గుండా వెళ్లే రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుండి అనంతపురం మీదుగా బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఎస్‌పి పి.జగదీష్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ గోపాలుడు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ తనిఖీలు కొనసాగాయి. డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.