ఎన్ని కేసులు పెట్టినా భయపడను : చెవిరెడ్డి

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : రాజకీయ కక్షతో టిడిపి కూటమి ప్రభుత్వం తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని, ధైర్యంగా ఎదుర్కొంటానని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా వీడియో రిలీజ్‌ చేశారు. తాను పదేళ్లుగా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉండడం వల్ల బాధ్యతగా స్పందించానని, మాజీ సిఎం జగనన్నతో నడుస్తున్నందుకే తనపై కుట్రపూరితంగా 11 సెక్షన్లతో కేసులు పెట్టారని విమర్శించారు. దళిత ఆడబిడ్డకు అండగా నిలబడినందుకు కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.

➡️