ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం, పుచ్చకాయలమాడకు అక్టోబరు ఒకటిన సిఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 1:45 గంటలకు కాశీవిశ్వేశ్వర దేవస్థానం సందర్శన, ఎన్‌టిఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. ఒకటిన ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి 11:35 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 12:40 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం స్థానిక నేతలతో కొద్దిసేపు మాట్లాడుతారు. అక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్నారు.